POLLS: నాలుగో దశకు సర్వం సిద్ధం

POLLS: నాలుగో దశకు సర్వం సిద్ధం
X
96నియోజకవర్గాల్లో రేపే పోలింగ్‌... విస్తృతమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం

సార్వత్రిక సమరం నాలుగోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96నియోజకవర్గాల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికలసంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1,717మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నాల్గోవిడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల పరిధిలోని 96లోక్‌సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్‌ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణ 17, ఉత్తర ప్రదేశ్ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్ 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈనెల 13న జరిగే తొలివిడతలో 28స్థానాలకు, ఈనెల 20న జరిగే రెండో విడతలో 35, ఈనెల 25న 42, జూన్ 1న 42శాసనసభ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది.


నాల్గోవిడతలో భాగంగా బిహార్‌లో దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. జమ్ముకశ్మీర్‌లో శ్రీనగర్, ఝార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్, ఖుూంటి, లోహర్దగ, పాలాము స్థానాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఇందౌర్, ఖర్గోన్, ఖాండ్వా లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది.

మహారాష్ట్రలో నందుర్బార్, జల్గావ్, రావెర్, జల్నా, ఔరంగాబాద్, మావల్, పుణె, షిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్‌లో కూడా పోలింగ్ జరగనుంది. ఒడిశాలో నబరంగ్‌పుర్, బెర్హంపుర్, కోరాపుట్, కలహండిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో షాజహాన్‌పుర్, ఖేరీ, ధౌరాహ్రా, సీతాపుర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్‌లో పోలింగ్ జరగనుంది. పశ్చిమబంగాల్‌లో బహరంపుర్, కృష్ణానగర్, రణఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్-దుర్గాపుర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్‌లో ఓటింగ్ నిర్వహించనున్నారు .

Tags

Next Story