Free Aadhaar Updates : ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు

Free Aadhaar Updates : ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
X

ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్రం మరోసారి పెంచింది. నేటితో ముగుస్తున్న డెడ్‌లైన్‌ను 14 జూన్ 2025 వరకు పొడిగించింది. పౌరులు ప్రతి పదేళ్లకు తమ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేస్తుండాలి. ఏజ్, పర్సనల్, అడ్రస్ మార్పులను నమోదు చేసుకోవాలి. ఆధార్ సేవా కేంద్రం లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా ఫ్రీగా మార్పులు చేసుకోవచ్చు. యూఐడీఏఐ నియమాల ప్రకారం, ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఇందులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర మార్పులు చేయవచ్చు. ఈ సేవలు 'మై ఆధార్‌' పోర్టల్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆధార్‌ కేంద్రాల్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాలి.

Tags

Next Story