Supreme Court : వాక్ స్వాతంత్ర్యం సమాజంలో అంతర్భాగమే : సుప్రీంకోర్టు

వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సమాజంలో అవి భాగమేనని.. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడం న్యాయస్థానాల విధి అని పేర్కొంది. రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్దీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్అభయ్స్ఓకా, జస్టిస్ ఉజ్జల భుయానధర్నాసనం.. గుజరాత్ పోలీసులు తీరుపై అసహనం వ్యక్తంచేసింది. 'సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం అంత ర్భాగం. ఆ హక్కును గౌరవించాలి. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలు, సాహిత్యం, పద్యాలు వంటివి మనుషుల లైఫ్ ను మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం అసాధ్యం. పోలీసులు రాజ్యాంగ ఆద ర్మాలకు కట్టుబడి ఉండాలి. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడాల్సి బాధ్యత కోర్టులదే అని పేర్కొంది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఎస్ఐఆరను కొట్టేస్తూ ఎంపీ ఇమ్రాన్ కు ఊరట ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com