Gas Shortage Hits : ఆగని గ్యాస్ మంటలు.. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కొరత..

గ్యాస్ మంటలు ఇండియాను కుదిపేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలపై ఇది ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇప్పటికే హోటళ్లు, హాస్టళ్లు మూత పడుతున్నాయి. పోనీ ఇండ్లకు అయినా వీటిని కరెక్ట్ గా సరఫరా చేస్తున్నారా అంటే అదీ లేదు. కమర్షియల్ సిలిండర్ల కొరత కామనే అనుకుంటే.. ఇప్పుడు సామాన్య జనాల ఇండ్లకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లు కూడా ఇన్ టైమ్ లో డెలివరీ కావట్లేదనే ఫిర్యాదులు లక్షల్లో వస్తున్నాయి. బుకింగ్ విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అదనపు బుకింగ్ లు తగ్గించి అర్హులకు గ్యాస్ సిలిండర్లు అందించాలనే లక్ష్యంతో పట్టణాల్లో 25 రోజులకు బుకింగ్ పీరియడ్ ను పెంచింది. అటు పల్లెటూర్లలో మాత్రం 45 రోజుల దాకా గ్యాస్ సిలిండర్ పీరియడ్ పెరిగింది. అంటే ఒక సిలిండర్ బుక్ చేసుకున్న 45 రోజుల దాకా ఇంకో సిలిండర్ ను బుక్ చేసుకోడానికి ఛాన్స్ లేదు. దీన్ని బట్టి గ్యాస్ కొరత ఏ స్థాయిలో ఉందో మనకు క్లియర్ గా అర్థం అవుతోంది.
ఇప్పటి వరకు చాలా రంగాలపై యుద్ధం ఎఫెక్ట్ పడుతోంది. హర్మూజ్ నుంచి ఇండియా నౌకలకు పర్మిషన్ ఇస్తామని ఇరాన్ చెప్తోంది. కానీ ఇది మునుపటి స్థాయిలో ఎగుమతులు జరిగేలా సహకరిస్తుందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ రిఫైనరీలు ఎగుమతులు దాదాపు ఆపేశాయి. ఇరాన్ మీద ఆధారపడినా గతంలో దిగుమతి చేసుకున్న స్థాయిలో ఇప్పుడు దిగుమతులు అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు గ్యాస్ కొరతను తగ్గించే పరిస్థితులు లేవు. ఇంకొన్ని రోజులు ఈ గ్యాస్ ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు చెబుతున్నారు.
Tags
- India gas shortage
- LPG crisis India
- commercial cylinder shortage
- domestic gas supply delay
- cooking gas crisis
- Middle East war impact on India
- Strait of Hormuz shipping issues
- Gulf oil exports decline
- LPG booking rules India
- energy supply crisis India
- oil refinery disruptions
- India fuel imports
- gas cylinder delivery delays
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
