Gold Prices Drop : తగ్గిన గోల్డ్ ధర .. తులం బంగారం రూ.77,350

Gold Prices Drop : తగ్గిన గోల్డ్ ధర .. తులం బంగారం రూ.77,350
X

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్స్ తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,900 (22 క్యారెట్స్), రూ.77,350 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున తగ్గింది.కానీ, వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి రేటు రూ.98,900 వద్ద స్థిరంగా ఉంది.

Tags

Next Story