PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. రేపే పీఎం కిసాన్ నిధుల విడుదల

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. రేపే పీఎం కిసాన్ నిధుల విడుదల
X

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధులను ఆగస్టు 2 న విడుదల చేయనున్నారు. రైతులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 2 , 2019 లో ప్రారంభమైన ఈ స్కీమ్ ప్రకారం అర్హులైన రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6 వేల రూపాయలను అందిస్తున్నారు. వీటిని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

కాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం 20 వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఆగస్టు 2 న వారణాసి లో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలోని 9.7 కోట్ల మంది రైతులకు ఈ విడతలో రూ.20,500 కోట్లు నిధులు పంపిణీ చేయనున్నారు. కాగా ఇప్పటికే రైతుల ఎంపిక, నిధుల కేటాయింపు పై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు19 వాయిదాలలో 3.69 లక్షల కోట్ల మంది రైతులు లబ్ది పొందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Tags

Next Story