Good News for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోన్లు

Good News for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోన్లు
X

విద్యార్ధులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. స్టూడెంట్లకు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ఆమె ప్రకటించారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వనున్నారు.

ఉన్నత చదువు కోసం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పథకం వర్తింపజేయనుంది. గరిష్టంగా 10 లక్షల జాతీయ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఇచ్చే విధంగా విధివిధానాలు పొందించనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Tags

Next Story