Central Government : ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యుస్

Central Government : ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యుస్
X

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి. త్వరలో కొత్త కమిషన్ కు చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. శ్రీహరికోటలోని షార్‌లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనున్నారు. ఎన్‌జీఎల్‌వీ ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎన్‌జీఎల్‌వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.

Tags

Next Story