RBI Governor : గుడ్ న్యూస్.. తగ్గనున్న హోమ్, పర్సనల్ లోన్స్

బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్బీఐ వరుసగా రెండో సారి కూడా కీలక రెపో రేట్లను తగ్గించింది. దీంతో లోన్లపై ఈఎంఐ తగ్గుతుంది. అదే సమయంలో కొత్తగా లోన్లు తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేటుకే తీసుకోగలుగుతారు. RBI కీలక రెపో రేట్లను వరుసగా రెండో సారి తగ్గించింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన కేంద్ర బ్యాంకు, ఇప్పుడు కూడా అదే విధంగా మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి చేరింది. సోమవారం నుంచి ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం కాగా.. ఆ నిర్ణయాల్ని సంజయ్ మీడియాకు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com