Delhi : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

27 ఏళ్ల తరువాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగురవేసింది. ఫిబ్రవరి 20న కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ ఆవుతోంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున సినీ తారలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు BJP వర్గాలు వెల్లడించాయి. ప్రఖ్యాత రామ్‌లీలా మైదాన్‌లో ఈ వేడుక జరుగుతుంది.
ప్రమాణస్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక, 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, BJP అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్‌కు వచ్చే చాన్సుంది. ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నట్లు BJP వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com