Gujarat : వర్షాలతో గుజరాత్ గజగజ.. 30 మంది మృతి

గాంధీ పుట్టిన నేల గుజరాత్‌ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గుజరాత్‌కి వరదల ముప్పు తొలగిపోలేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ లో అనేక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వరదల ధాటికి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం వెల్లడించారు. పశ్చిమ ప్రాంతాలపై వర్షాల ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది.
వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న వేళ ప్రధాని మోదీ.. సీఎం భూపేంద్ర పటేల్ తో ఫోన్ లైన్ లో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని మోదీ తెలిపారు. వడోదరాలో సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి ఐదు అడిషనల్ డీఆర్ఎస్ ఫోర్స్ టీమ్స్, ఆర్మీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అహ్మదాబాద్, సూరత్ నుంచి రెస్క్యూ బోట్లను వడోదరకు పంపించారు.
వడోదరలో 10 నుంచి12 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రెస్క్యూ కొనసాగించడానికి సైన్యం సహకారం కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు 40 వేల మంది వరదలతో ప్రభావితమయ్యారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం స్పీడప్ చేసింది. వడోదరలో వరుణుడు కాస్త శాంతించినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం ధాటికి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో నివాస ప్రాంతాలు మునిగిపోయాయి. ఆజ్వా ఆనకట్ట ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com