Hamas Chief : హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ హతం

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ హతమయ్యాడు. టెహ్రాన్ లోని అతడి నివాసం పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడంతో ఆయన మృతి చెందాడు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ దాడిలో ఇస్మాయిల్ బాడీగార్డ్ కూడా మృతి చెందాడు.
ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెప్కి యాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తిరిగి టెహ్రాన్ వెళ్లి ఇంటికి వచ్చాక ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో హనియా, ఆయన బాడీగార్డ్ మృతి చెందినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ మాత్రం ఈ ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
హనియేహ్ మరణంపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్థుక్ ఓ ప్రకటన విడుదల చేశాడు. 'ఇది కుట్రపూరిత చర్య. దీనికి బదులు తప్పదు' అంటూ ఇజ్రాయెల్ పై ప్రతీకార హెచ్చరికలు చేశాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలోనే తమ చీఫ్ మృతి చెందాడని హమాస్ ఆరోపించింది. ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ తీవ్రంగా ఖండించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com