World Best Companies : వరల్డ్ బెస్ట్ కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో
2024లో ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ ఆదివారం విడుదల చేసింది. ‘టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024’ పేరిట విడుదల చేసిన ఈ లిస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలు చోటుదక్కించుకున్నాయి.ఇందులో భారత్‌కు చెందిన 22 సంస్థలు ఉన్నాయి. అత్యుత్తమ
ఇండియన్ కంపెనీల జాబితాలో ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తొలి స్థానంలో నిలిచింది. 112 ర్యాంక్‌తో హెచ్‌సీఎల్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా..ఆ తర్వాత 119 ర్యాంక్‌తో ఇన్ఫోసిస్, 134 ర్యాంక్‌తో విప్రో, 187 ర్యాంక్‌తో మహీంద్రా గ్రూప్ నిలిచాయి. బ్యాంకుల విభాగంలో 504 ర్యాంక్‌తో యాక్సిస్ బ్యాంక్ ముందంజలో ఉంది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (518), ఐసీఐసీఐ బ్యాంక్ (525), ఎల్‌అండ్‌టీ (549), కోటక్ మహీంద్రా బ్యాంక్ (551), ఐటీసీ (586), హీరో మోటోకార్ప్ (597), రిలయన్స్ ఇండస్ట్రీస్ (646), మథర్‌సన్ గ్రూప్ (697), అదానీ గ్రూప్ (736), ఎన్‌టీపీసీ లిమిటెడ్ (752), యెస్ బ్యాంక్ (783), బ్యాంక్ ఆఫ్ బరోడా (850), గోద్రెజ్ (921), బజాజ్ గ్రూప్ (952), సిప్లా (957), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (987), ఎంఆర్‌ఎఫ్ (993)లు ఉన్నాయి.
ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వం ఆధారంగా టైమ్.. ఈ కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చింది. 50 దేశాల్లో మొత్తం 1,70,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. దీంతో పాటు 2021 నుంచి 2023 వరకు కంపెనీల వృద్ధిని పరిగణనలోకి తీసుకుంది. 2023 నాటికి కంపెనీలు 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వాటిని ఎంపిక చేసింది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com