Terrorist Rana : రాణా తరలింపునకు భారీ భద్రత

Terrorist Rana : రాణా తరలింపునకు భారీ భద్రత
X

కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న రాణాను కట్టుదిట్టమైన భద్రత మధ్య NIA కార్యాలయానికి తరలించనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన పాలెం విమానాశ్రయంలో దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌లోకి అతడిని షిఫ్ట్ చేస్తారు. సాయుధ బలగాలు, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోల రక్షణతో ట్రాఫిక్ క్లియర్ రూట్‌లో కాన్వాయ్ వెళ్తుంది. ఏ రకమైన దాడినైనా తట్టుకునే ‘మార్క్స్ మ్యాన్’ వాహనాన్ని దీనికి స్టాండ్‌బైగా ఉంచారు.

26/11 కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ రాణా ఇస్లామాబాద్ వాసి. కాలేజీ రోజుల్లో మరో కుట్రదారు డేవిడ్ హెడ్లీతో పరిచయం ఏర్పడింది. పాక్ ఆర్మీలో డాక్టరైన రాణా 1997లో మేజర్ హోదాలో రిటైరై కెనడా వెళ్లి ఆ దేశ పౌరుడిగా మారాడు. అనంతరం USAలో వీసా ఏజెన్సీ పెట్టగా హెడ్లీ ఈ దాడుల కోసం అతడిని కలిశాడు. దీంతో ముంబైలో రాణా వీసా ఏజెన్సీ తెరవడంతో హెడ్లీ ఆ వంకతో తరుచూ వచ్చి లొకేషన్లు రెక్కీ చేసి నరమేధ వ్యూహ రచన చేశాడు.

Tags

Next Story