Delhi : ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్

కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 10 రైతు సంఘాలు ఢిల్లీలో ఇవాళ పాదయాత్ర చేపట్టేందుకు పిలుపు నిచ్చాయి. దీంతో రైతులను అడ్డుకునేందుకు నోయిడా పోలీసులు గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీని కలిపే అన్ని సరిహద్దులను మూసివేశారు. అలాగే ఢిల్లీకి వచ్చే కొన్ని రూట్లను డైవర్ట్ చేశారు. దీంతో ఢిల్లీ నోయిడా సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని కోరారు. యమునా ఎక్స్ ప్రెస్ హైవే నుంచి నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ హైవే ముంచి ఢిల్లీకి, సిర్సా నుంచి పారిచౌక్ మీదుగా సూరజ్ పూర్ వచ్చే రాహదారులను మూసివేశారు. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. కాగా మధ్యాహ్నం 12 మహామాయ ఫ్లైఓవర్ కింద నుంచి రైతులు తమ పాదయాత్రను ప్రారంభిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com