Haryana-Punjab Border : శంభు బార్డర్ లో హైటెన్షన్

Haryana-Punjab Border : శంభు బార్డర్ లో హైటెన్షన్
X

హర్యానా -పంజాబ్ సరిహద్దులోని శంభు ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడి రైతు దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించారు. పంటలకు కనీస మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతులు కొంతకాలంగా అక్కడ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర బృందంతో నిన్నరైతు సంఘం నాయకులు చర్చలు జరిపారు. అయితే చర్చలు తమకు ఆమోదయోగ్యంగా లేవంటూ రైతులు శంభు, ఖనౌరి ప్రాంతాల వైపు వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్వాల్, స్వరణ్ సింగ్ పంధేర సహా పలువురిని మొహాలీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్చలు మే 4న జరగనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రైతుల నాయకు లను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు శంభు సరిహద్దులో రోడ్డుకు అడ్డంగా రైతులు నిర్మించిన నిర్మాణాలను జేసీబీ సాయంతో తొలగించారు. రైతులను అక్కడి నుంచి బస్సుల్లో ఇళ్లకు తరలించారు. రైతులు దీక్షా శిభిరం ఖాళీ చేసి వెళ్లేందుకు స్వచ్చందంగా సహకరిస్తున్నార ని పోలీసులు తెలిపారు.

Tags

Next Story