Himachal Pradesh CM : వైల్డ్ చికెన్’ వివాదంలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం

X
By - Manikanta |15 Dec 2024 2:15 PM IST
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా వైల్డ్ చికెన్ వ్యవహారం ఆయన్ను ఇబ్బందిపెడుతోంది. సీఎం పాల్గొన్న కార్యక్రమంలో చికెన్ వడ్డించిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం, ఇతర నేతలు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఏర్పాటు చేసిన విందు మెనూలో వైల్డ్ చికెన్ కూడా ఉంది. అలాగే దానిని వడ్డించిన వీడియో వైరల్ అయింది. సుఖు ఆ వంటకం తిననప్పటికీ ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అతిథులకు నిర్వాహకులు దానిని వడ్డించారు. ఆ చికెన్‌ను మెనూలో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఒకటి వీడియోను పోస్టు చేసింది. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com