HMPV: గుజరాత్‌లో మరో బాలుడికి HMPV

గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. బాలుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో గుజరాత్‌లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బాలుడికి వైద్య సహాయం అందిస్తున్నామని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్య అధికారి భవిన్ సోలంకి తెలిపారు.
గుజరాత్‌లో ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్లు వెల్లడించారు. జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. ఎస్‌జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలుడికి హెచ్‌ఎంపీవీ సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు.
కాగా, గుజరాత్‌లో ఇప్పటి వరకు 8 హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com