Road Accident: కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు..

రాజస్థాన్ కరౌలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. అతివేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టింది. కరౌలీ-గంగాపూర్ హైవేపై సాలెంపూర్ వద్ద జరిగిన ఘటన జరిగింది. ఇందులో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కారు గంగాపూర్ నుంచి కరౌలి వైపు వెళ్తుండగా ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న బస్సు అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను గుజరాత్‌కు చెందిన వారుగా గుర్తించారు. వారంతా గతంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నివాసం ఉండేవారని.. ప్రస్తుతం గుజరాత్ వడోదరలో నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. మృతుల బంధువులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com