Adani Group : 6వేల కోట్లతో ఆసుపత్రులు.. అదానీ గ్రూప్ నిర్ణయం

Adani Group : 6వేల కోట్లతో ఆసుపత్రులు.. అదానీ గ్రూప్ నిర్ణయం
X

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో అన్ని సదుపాయాలతో కూడిన రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనుంది. ఒక్కోటి 1000 పడకలతో 6 వేల కోట్ల వ్యయంతో నిర్మించనుంది. చిన్న కుమారుడి వివా

సందర్భంగా ప్రకటించిన 10 వేల కోట్ల విరాళంలో భాగంగా ఈ ఆసుప త్రుల నిర్మాణం చేప్పటనుంది. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయలు, అన్ని వర్గాల కు వైద్య విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. భవిష్యత్ లో పలు నగరాల్లో అదానీ హెల్త్ సిటీలను నిర్మిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం నిర్మించే రెండు ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీ, క్లినికల్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్ వంటి సదుపాయలు ఉంటాయి.

Tags

Next Story