Nipah Virus : నిపా వైరస్ సోకితే ఎలా ట్రేస్, ట్రీట్ చేస్తారో తెలుసా?

నిషా వైరస్ సోకినట్టు గుర్తించిన రోగి కుటుంబం, ఇరుగు పొరుగు కుటుంబాలు, కాలనీల్లో యాక్టివ్ కేసుల కోసం పరీక్షలు నిర్వహించాలి. గత 12 రోజులలో రోగిని కలిసిన వ్యక్తుల కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి, వారిని కఠినమైన నిర్బంధం (క్వారంటైన్)లో ఉంచడం, అనుమానిత లక్షణాలు కల్గిన వారిని మిగతావారి నుంచి దూరంగా ఉంచడం చేయాలి. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసిన వారి నమూనాల సేకరించి, ల్యాబ్ టెస్టుల కోసం సురక్షితంగా తరలించాలి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ 'వన్ హెల్త్ మిషన్' నుంచి బహుళ-సభ్య జాయింట్ రెస్పాన్స్ టీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు నిషా కేసులపై దర్యాప్తు చేయడంతో పాటు ఎపిడెమియోలాజికల్ లింకేజీలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తారని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రోగులకు అందించే చికిత్సలో భాగంగా ఐసీఎంఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీలను కేరళ రాష్ట్రానికి పంపించింది. రోగి కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యక్తుల నుంచి అదనపు నమూనాలను పరీక్షించడానికి మొబైల్ బీఎస్ ఎల్ -3 ప్రయోగశాలను కోజికోడ్ కు పంపించింది. ఇప్పటికే అది అక్కడికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
గబ్బిలాలు కొరికిన పండ్లను తిన్నవారికి నిషా వైరస్ సోకుతోంది. ఆ తర్వాత ఒక రోగి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమణ జరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూసుకోవాల్సి ఉంటుంని కేంద్రం సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com