Maharashtra: బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Maharashtra: బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
X
మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతం నుండి వచ్చిన విజువల్స్‌లో, పెద్ద ఫ్యాక్టరీ భవనం నుండి భారీ మంటలు ఎగసిపడుతున్నట్లు చూడవచ్చు.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన వివరాలను పంచుకుంటూ, భివాండి అగ్నిమాపక దళ అధికారి, ప్రమోద్ కకడే మాట్లాడుతూ, "సరావలి గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి... ఈ సంఘటన తెల్లవారుజామున 3:00 గంటలకు జరిగింది. మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి మంటలు పూర్తిగా ఆరిపోయిన తరువాత అప్పుడు మేము నష్టాన్ని లెక్కించగలుగుతాము అని చెప్పారు.

Tags

Next Story