Jammu and Kashmir : జమ్ము కాశ్మీర్ లో భారీ త్రివర్ణ పతాక ర్యాలీ...

మరో మూడు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం రానున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 1508 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో ఈ ర్యాలీ జరిగింది. డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్ నేతృత్వంలో వెల్కమ్ దోడా ఎంట్రీ గేటు నుంచి కమ్యూనిటీ హాల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ ర్యాలీ లో ప్రదర్శించిన భారీ త్రివర్ణ పతాకం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తిని చాటుకుంటూ దేశభక్తి గీతాలను ఆలపిస్తూ, నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ భారీ త్రివర్ణ పతాక ర్యాలీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను షేర్ చేస్తూ దేశ భక్తిని చాటుతున్నారు నెటిజన్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com