Central Government : హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 ప్రతిపాదన అందింది: కేంద్రం

Central Government : హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 ప్రతిపాదన అందింది: కేంద్రం
X

హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు అందాయని కేంద్రం వెల్లడించింది. ఐదు కారిడార్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను అందించిందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. మెట్రోరైల్ ఫేజ్ 1ను పీపీపీ పద్దతిలో చేపట్టామన్నారు. దానికి పొడగింపుగా మెట్రో పాలసీ 2017 చట్టం ప్రకారం అందించిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామన్నారు. గురువారం ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రాజెక్ట్ అవసరాలు, నిర్మాణ లభ్యతను బట్టి అనుమతులు ఆధారపడి ఉంటాయన్నారు. వాటిపై కేంద్ర ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

Tags

Next Story