Karnataka CM : ఐదేండ్లూ నేనే సీఎం : సిద్దరామయ్య

Karnataka CM : ఐదేండ్లూ నేనే సీఎం : సిద్దరామయ్య
X

కర్ణాటక సీఎం మార్పిడిపై జరు గుతున్న చర్చపై సిద్ధరామయ్య స్పందించారు. ఐదేండ్లూ తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని కుండబద్దలు కొట్టారు. సీఎం మార్పు ఉంటుందని బీజేపీ, జేడీఎస్ చేస్తున్న ప్రచారాన్ని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. సీఎం మార్పు గురించి చెప్పడాని కి వారేమైనా కాంగ్రెస్ హై కమాండా? అని ప్రశ్నిం చారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ..' సీఎంకు అండగా ఉండటం తప్ప తనకు ఇంకో ఆప్షన్ లేదన్నారు. తాను ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అధిష్టానం ఏం చెబితే అది చేయాలని అన్నారు. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీ కరించే అవకాశముందని అన్నారు. దీంతో కర్ణాటకలో సీఎం మార్పుపై చర్చ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం డీకే శివకుమార్, సిద్దరామయ్య పోటీ పడ్డారు. ఈ క్రమంలో తలా రెండున్నరేండ్ల పాటు సీఎంగా కొనసాగేందుకు ఒప్పందం కుదిరిందనే చర్చ బయటికి వచ్చింది. ముడా సహా పలు కేసుల్లో సి ద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెర పైకి వచ్చాయి. దీంతో హాట్ టాపిక్ గా మారింది. సీఎం మార్పు ప్రరచారంపై కాంగ్రెస్ జనరల్ సె క్రటరీ రణదీప్ సూర్జేవాలా, డీకే శివకుమార్ స్పం దించారు. మార్పు ఉండదంటూ ఖండించడం గమనార్హం.

Tags

Next Story