Tamil Nadu BJP Chief : డీఎంకేను అధికారం నుంచి దించే వరకు వదలను : అన్నామలై

బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన తెలిపారు. అన్నా యూనివర్శిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై అన్నామలై ప్రెస్మీట్ పెట్టారు. 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వివరాలు ఉన్న ఎఫ్ఎస్ఐఆర్ లీక్ అవ్వడంపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బాధితురాలే భయపడేలా పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ రాయడాన్ని ఖండించారు. డీఎంకే ప్రభుత్వంలో మహిళల కు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జ్ఞానశేఖరన్ గతంలో కూడా నేరాలు చేశాడని అన్నామలై ఆరోపించారు. డీఎంకే నేతలతో ఉన్న కారణంగా పోలీసుల ఆయనపై రౌడీ షీట్ తెరవలేదని విమర్శించా రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్ష లు వేసుకోబోనని బీజేపీ చీఫ్ అన్నామలై ప్రక టించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజ కీయాలు చేయబోనని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com