మనం సర్దార్ పటేల్ మాటలను అంగీకరించి ఉంటే పహల్గామ్ దాడి జరిగేది కాదు: ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం గాంధీనగర్‌లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ యుద్ధ వ్యూహమని అన్నారు. ఆనాడు సర్దార్ పటేల్ మాటలను కాంగ్రెస్ అంగీకరించి ఉంటే, గత 75 సంవత్సరాలుగా జరుగుతున్న ఉగ్రవాద సంఘటనల పరంపర ఆగిపోయి ఉండేదని ఆయన అన్నారు. ఉగ్రవాదంతో పాటు, దేశ అభివృద్ధి గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు..
మే 6 రాత్రి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో మరణించిన పాక్ ఉగ్రవాదుల మృతదేహాలకు అక్కడి ప్రభుత్వం వారి శవపేటికలపై పాకిస్తాన్ జెండాలను ఉంచి గౌరవ లాంచనాలతో అంత్యక్రియలు జరిపించింది. అక్కడి సైన్యం వారికి సెల్యూట్ చేసింది. దీంతో ఉగ్రవాద కార్యకలాపాలు పరోక్ష యుద్ధం కాదని, ఇది పాకిస్తాన్ ప్రణాళికతో చేసిన యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తుంది.
1947లో భారతమాత ముక్కలుగా విడిపోయింది. దేశం మూడు భాగాలుగా విభజించబడింది. ఆ రాత్రే కాశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది.
ముజాహిదీన్ పేరుతో ఉగ్రవాదుల సహాయంతో పాకిస్తాన్ మదర్ ఇండియాలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ రోజు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే, గత 75 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉగ్రవాద సంఘటనల పరంపర కొనసాగేది కాదు.
మే 26... 2014 మే 26న, నాకు మొదటిసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది.
మనం కరోనాతో పోరాడాం, పొరుగువారి నుండి సమస్యలను ఎదుర్కొన్నాం, ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొన్నాం, అయినప్పటికీ ఇంత తక్కువ సమయంలోనే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలి, మనకు పురోగతి కావాలి.
రాబోయే రోజుల్లో పర్యాటక రంగంపై మనం దృష్టి పెట్టాలి. గుజరాత్ అద్భుతాలు చేసింది. గతంలో ఎవరూ వెళ్ళని కచ్ ఎడారిలోకి నేడు వెళదామంటే బుకింగ్‌లు అందుబాటులో లేవనే పరిస్థితిని ఎవరైనా ఊహించగలరా. పరిస్థితులు మారుతాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవు అని ప్రధాని మోదీ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com