గెలవాలంటే కలవాలి.. ఇందుకు ఏపీనే ఉదాహరణ: విజయ్ కు పీకే రాజకీయ హిత బోధ

గెలవాలంటే కలవాలి.. ఇందుకు ఏపీనే ఉదాహరణ: విజయ్ కు పీకే రాజకీయ హిత బోధ
X
కొత్తగా పార్టీ పెట్టావు.. వేదికలెక్కి ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు విశ్వసించరు. అప్పటికే ఉన్న పార్టీపై ప్రజలు కొంత విశ్వాసంతో ఉంటారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత కిషోర్ నటుడు విజయ్ కు రాజకీయ హిత బోధ చేస్తున్నారు. ఇందుకు విజయ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కొత్తగా పార్టీ పెట్టావు.. వేదికలెక్కి ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు విశ్వసించరు. అప్పటికే ఉన్న పార్టీపై ప్రజలు కొంత విశ్వాసంతో ఉంటారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత కిషోర్ నటుడు విజయ్ కు రాజకీయ హిత బోధ చేస్తున్నారు. ఇందుకు విజయ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

విజయ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయవంతం చేయాలంటే తన వ్యూహం తిరుగు లేనిదిగా ఉండాలి. అందులో అపొజిషన్ లో ఉన్నది బలమైన ప్రత్యర్థులు. నిన్న మొన్న పార్టీని ప్రజలు విశ్వసించరు. అందుకే అప్పటికే ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే విజయ్ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని పళని స్వామి కేంద్రంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోమని ప్రశాంత్ విజయ్ కి సూచించారు. అప్పుడైతే పళనిస్వామి సీఎం కాగలరు, నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు అని ఓ బ్రహ్మాండమైన సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిశోర్ సూచనలు

ఈ వ్యూహాన్ని అమలు చేస్తే, ప్రస్తుతం అన్నాడీఎంకేకు ఉన్న 25% ఓట్లు, టీవీకేకు 15-20% వరకు లభించే అవకాశముందని, ఇతర చిన్న పార్టీలు కలిసి వస్తే 50%కు పైగా ఓటింగ్ సాధ్యమవుతుందని విజయ్‌కు పీకే వివరించినట్టు సమాచారం. వచ్చే ఏడాదిలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ ఉత్కంఠకు తెరతీయనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను అధికారంలోకి తీసుకురావడానికి విజయ్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సలహా, సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ, డీఎంకే రెండూ తనకు ప్రధాన శత్రువులని విజయ్ ఇప్పటికే స్పష్టంగా వెల్లడించడంతో, ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే దానిపై పీకే కీలక సూచనలు చేసినట్టు సమాచారం.

ఏపీ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా పీకే విజయ్‌కు వివరించారని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు ఏపీలో ఘన విజయాన్ని సాధించారని. అదే తరహాలో అన్నాడీఎంకే-టీవీకే పొత్తు తమిళనాడులో విజయాన్ని అందించగలదని పీకే భావిస్తున్నారు. సినీ ప్రపంచం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, విజయ్ మధ్య అనేక పోలికలు ఉన్నాయన్న ప్రశాంత్ కిశోర్, పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ కూడా తమదైన రాజకీయ ముద్ర వేసుకోవచ్చని విశ్వసిస్తున్నట్టు సమాచారం.

పీకే సూచనలు, రాజకీయ ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే విజయ్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన అభిమానులను, కొత్త ఓటర్లను ఆకర్షించేలా టీవీకే ప్రత్యేకంగా ఓ గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.


Tags

Next Story