ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని..

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని..
ఐఐటీ చదువుతున్నా ఆత్మన్యూన్యతో బాధపడుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యే అని భావిస్తున్నారు.

ఐఐటీ చదువుతున్నా ఆత్మన్యూన్యతో బాధపడుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యే అని భావిస్తున్నారు. తాము పడుతున్న మానసిక వేదనను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడక, ఒంటరిగా రోదిస్తున్నారు.. ఒకానొక సమయంలో బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు.. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ విషయంపై ప్రభుత్వం, విద్యాసంస్థలు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన ఓ టెక్‌ విద్యార్థి తన హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. విద్యార్థి సంజయ్ నెర్కర్ (24) తమ ఫోన్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది తోటి విద్యార్థులకు సమాచారం అందించి ఎంక్వైరీ చేయమన్నారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు.

నెర్కర్ (24) ద్రోణాచార్య హాస్టల్‌లోని రూం నంబర్ 757లో ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందినవాడని పోలీసు అధికారి తెలిపారు. మిగతా విద్యార్థులు అతని గదికి వెళ్లి చూడగా లోపల నుంచి తాళం వేసి ఉండడం గమనించారు. వారు హాస్టల్ వార్డెన్ కు సమాచారం అందించగా, అతను తలుపులు పగలగొట్టాడు. నేర్కర్ మృతదేహం గది పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని అధికారి తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇప్పటి వరకు, ఎటువంటి సూసైడ్ నోట్ కనుగొనబడలేదు. కుటుంబ గోప్యతను గౌరవించేలా విద్యార్థి యొక్క గుర్తింపును బహిర్గతం చేయకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

అంతకుముందు, న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఎఎంసి) కి చెందిన వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 23 ఏళ్ల విద్యార్థిని ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఇంతలోనే విద్యార్థిని హాస్టల్ గదిలో శవమై కనిపించింది.

Tags

Next Story