IMD: భారత వాతావరణ శాఖకు 150 ఏళ్లు
వర్షాల తిప్పలు, తుఫాను ముప్పుల గురించి నిత్యం మనల్ని హెచ్చరించి, అప్రమత్తం చేసే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వసంతంలోకి అడుగు పెట్టింది. జనవరి 15, 1875న ఐఎండీని స్థాపించారు. వాతావరణ అబ్జర్వేటరీలు మాత్రం చాలా ముందుగానే ఏర్పాటు చేశారు. మొదటి వాతావరణ అబ్జర్వేటరీలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. 1875లో ఐఎండీని స్థాపించినప్పుడు ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. 1905లో దీనిని సిమ్లాకు, తరువాత 1928లో పూణేకు, చివరికి 1944లో ఢిల్లీకి తరలించారు.
ఐఎండీ 150 ఏళ్ల ఉత్సవాలకు పాక్, బంగ్లా
భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ను స్థాపించి 150 సంవత్సరాలు పూర్తవుతోన్న వేళ.. ఐఎండీ ‘‘అన్ డివైడెడ్ ఇండియా’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్ ఆహ్వానించింది. ఐఎండీ 150 వసంతాల సెమినార్‌లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు పొరుగు దేశాలను ఆహ్వానించింది. పాక్, బంగ్లాతోపాటు భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ లకు ఆహ్వానాలు పంపారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ వస్తామని చెప్పింది. అయితే, బంగ్లాదేశ్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ బంగ్లాదేశ్ ఈ కార్యక్రమానికి హాజరైతే ఒక చారిత్రాత్మక సంఘటన అవుతుంది. ఈ ప్రత్యేక సమయంలో పరిమిత ఎడిషన్‌లో రూ. 150 స్మారక నాణెం విడుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రత్యేక శకటానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com