Heavy Rains : ఐఎండి రెయిన్ అలర్ట్.. ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక..
ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది. ఉన్న క్రమంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో నిన్న జోరు వాన కురిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, గుజరాత్ లలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పలు రాష్ట్రాల్లో:
ఇక ఆగస్టు 15న కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ము, హర్యానా, ఛత్తీస్‌గఢ్ , ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమం లోనే వర్షపు నీటిలో మునిగి ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com