PM MODI: అధికారం చేజారదు.. అభివృద్ధి ఆగదు
భారత్ అభివృద్ధి ప్రయాణం ఆగే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ(PM Modi) స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందని(In My Third Term) ధీమా వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తి(World's Top 3 Economies) ఘనతనను కూడా సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి భారతదేశ మౌలిక సదుపాయాలు మోరుగవుతున్నాయని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన, పొడవైన సొరంగం, ఎత్తైన రహదారి, అతిపెద్ద స్టేడియం, అతిపెద్ద విగ్రహం ఇవన్నీ భారత్‌లోనే ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం త్వరలో దిల్లీలో ఏర్పాటు కాబోతోందన్నారు. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోందని తెలిపారు.
ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (IECC)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. జీ-20’ శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)కు వేదిక కానున్న ఈ కన్వెన్షన్ సెంటర్‌కు భారత్ మండపం (Bharat Mandapam)గా నామకరణం చేశారు. కొత్తగా నిర్మించిన భారత్ మండపం’ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుందని, సమావేశాల టూరిజానికి భారత్ మండపం’ ఊతమిస్తుందని మోదీ అన్నారు.
దేశ ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధి ఉంటుందని ప్రధాని వెల్లడించారు. తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, రెండోసారి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేశామని మోదీ తెలిపారు. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోని మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి భారత్ మాతృమూర్తి అనే విషయాన్ని యావత్ ప్రపంచం అంగీకరిస్తోందని తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొన్ని వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఉన్నతంగా ఆలోచించాలని, గొప్ప కలలను కనాలని, అందుకు తగినట్లుగా కార్యచరణను ఆచరించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఏ ఒక్క భారతీయుడు కూడా పార్లమెంటు నూతన భవనాన్ని గొప్పగా చెప్పుకోకుండా ఉండలేరని మోదీ అన్నారు. పని చేసే విధానాన్నే కాకుండా పని వాతావరణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘జీ-20’ శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)కు ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (IECC) వేదిక కాబోతోంది. ఈ వేదికకు భారత్ మండపంగా నామకరణం చేశారు. దిల్లీలో 123 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ₹2,700 కోట్ల వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. సెప్టెంబర్‌లో జరిగే జీ20 సదస్సుకు ఆయా దేశాధినేతలతో పాటు భారీ సంఖ్యలో విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com