Income Tax Return : ఆదాయ పన్ను రిటర్న్‌ల గడువు పొడిగింపు

రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువును ఆదాయపు పన్ను విభాగం పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్ 31 గడువు ముగియనుండగా.. భారత నివాసితులకు 2025 జనవరి 15 వరకు అవకాశం కల్పించింది. జులైలో ఎవరైతే ఐటీఆర్ దాఖలు చేయలేదో వారు జరిమానా చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే గడువు లోపు ఐటీఆర్ సమర్పించినా ఒకవేళ అవసరమైతే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలనుకున్నవారూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 (మదింపు సంవత్సరం 2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు ఈ ఏడాది జులై 31తోనే ముగిసింది. ఏదైనా కారణంతో రిటర్నుల ప్రక్రియను పూర్తి చేయని వారికి చివరి అవకాశం చట్టం కల్పిస్తోంది. అలా ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకూ దాఖలు చేసిన రిటర్నులను ‘బిలేటెడ్ రిటర్న్’గా పేర్కొంటారు. బిలేటెడ్ ఐటీఆర్ సమర్పించే వారి వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్నప్పుడు రూ.1,000, అంతకుమించి ఉంటే రూ.5,000 వరకూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఈ గడువును జనవరి 15 వరకు పొడిగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com