GST : పెరిగిన జీఎస్టీ వసూళ్లు

GST : పెరిగిన జీఎస్టీ వసూళ్లు
X

వస్తు, సేవల పన్ను వసూళ్ల లో మరోసారి వృద్ధి నమోదైంది. గత సంవత్సరం మార్చి తో పోల్చితే ఈ సంవత్సరం మార్చిలో వసూళ్లు 9.9 శాతం పెరిగి 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో సెంట్రల్ జీఎస్ట వసూళ్లు 38,100 కోట్లు, స్టేట్ జీఎస్టి వసూళ్లు 49,900 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టి వసూళ్లు 95,900 కోట్లు, జీఎస్టి సెస్ వసూళ్లు 12,300 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో నికర జీ ఎస్జీటీ వసూళ్లు 1.76 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం మార్చితో పోల్చితే ఇవి 7.3 శాతం ఎక్కువ. 2024-25 ఆర్ధిక సంవత్సరం లో జీఎస్టీ వసూళ్లు మొత్తం 22.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం లో వసూళ్ల కంటే ఇవి 9.4 శాతం ఎక్కువ. రిఫండ్ సర్ధుబాట్ల తరువాత మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర వసూళ్లు 19.56 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఫి బ్రవరి నెలలో 1,83,646 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్ల నమోదయ్యాయి.

Tags

Next Story