భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

భారత్ లో వరుసగా రెండో రోజు 80,000 కేసులు, 1,000 మందికి పైగా మరణాలు నమోదు అయ్యాయి, గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 83,341 కేసులు నమోదు కాగా, 1096 మంది ప్రాణాలు విడిచారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం 39,36,748 కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్త మరణాలతో కలిపి ఇప్పటివరకూ 68,472 మంది కరోనా వ్యాధితో మరణించారు. ఇక కొత్తగా 66,659 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం 30,37,151 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,31,124 గా ఉన్నాయి. ఇదిలావుండగా ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.15 శాతంగా ఉంది.

Tags

Next Story