Kailash Mansarovar Yatra: ఇండియా చైనాల మధ్య కీలక ఒప్పందాలు..

Kailash Mansarovar Yatra:  ఇండియా చైనాల మధ్య కీలక ఒప్పందాలు..
X
మానసరోవర్ యాత్ర, డైరెక్ట్ ఫ్లైట్స్‌కి అంగీకారం..

భారత, చైనాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు రోజలు పాటు విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. దీనిలో వేసవిలో కైలాస్-మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుత ఒప్పందాల ప్రకారం.. దీనికి సంబంధించిన విధానాలను సంబంధిత యంత్రాంగం చర్చిస్తోందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ప్రారంభించాలని సూత్రప్రాయ ఒప్పందం కుదిరింది.

భారతదేశం, చైనా మధ్య విదేశాంగ కార్యదర్శి-ఉప విదేశాంగ మంత్రి సమావేశం కోసం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ రోజు బీజింగ్‌ని సందర్శించారు. చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. సరిహద్దు నదులకు సంబంధించిన డేటాను అందించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

గతేడాది అక్టోబర్‌లో రష్యా కజాన్‌లో బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించుకోవాలని భావించాయి. బ్రిక్స్ సమావేశాలకు ముందు భారత్- చైనా సరిహద్దుల్లో తమ తమ బలగాలు వెనక్కి వెళ్లాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగింది. ఆ తర్వాత నుంచి ఇరు దేశాలు కూడా తమ సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు చర్చిస్తున్నాయి.

Tags

Next Story