భారత్ లో నిలకడగా కరోనా కేసులు.. 24 గంటల్లో..

భారత్ లో నిలకడగా కరోనా కేసులు.. 24 గంటల్లో..
భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. మొన్న 78 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా... నిన్న ఆ..

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. మొన్న 78 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా... నిన్న ఆ సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో.. కొత్తగా 70 వేల 496 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69 లక్షల మార్క్‌ దాటింది. ఇందులో 8 లక్షల 93 వేల 592 యాక్టివ్ కేసులు ఉండగా... మరో 59 లక్షల 6 వేల మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజులో 964 మంది మృతి చెందగా... మొత్తంగా మరణాల సంఖ్య ఒక లక్షా 6 వేల 490కి చేరింది.

నిన్న ఒక్క రోజులో... కరోనా నుంచి కోలుకుని 78 వేల 365 మంది రికవర్ అయ్యారు. దేశంలో ప్రస్తుతంలో కరోనా రికవరీ రేటు 85.52 శాతం ఉండగా.. మరణాల రేటు.. 1.54 శాతంగా ఉన్నట్టు.. కేంద్రం ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో గత 24 గంటల్లో... 11 లక్షల 68 వేల 705 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహారాష్ట్రలో... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 15 లక్షలకు చేరుకుంది. కొత్తగా అక్కడ దేశంలోనే అత్యధికంగా 13 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య దాదాపు 40 వేలకు చేరుకుంది. కేరళలో వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా అక్కడ మరో ఐదున్నర వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కర్నాటక, తమిళనాడులో చెరో ఆరున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story