PM Modi : భారత్ యుద్ధం కోరుకోదు.. బ్రిక్స్ సదస్సులో మోడీ సందేశం ఇదే

PM Modi : భారత్ యుద్ధం కోరుకోదు.. బ్రిక్స్ సదస్సులో మోడీ సందేశం ఇదే
X

భారత దేశం ఎన్నడూ యుద్ధానికి మద్దతు ఇవ్వదని.. చర్చలు, దౌత్యానికి మాత్రమే మద్దతు ఇస్తుందని బ్రిక్స్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అన్ని వివాదాలు చర్చలతో పరిష్కృతమవుతాయని చెప్పారు. బ్రిక్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చినందుకు, గత ఏడాదిగా కూటమికి నాయకత్వం వహించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కూడా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నిరోధించడం, ఆహారం, విద్యుత్తు, ఆరోగ్యానికి భరోసా, నీటి భద్రత, ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, డీప్‌ఫేక్‌ల వంటి సైబర్ మోసాలు వంటి కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయని చెప్పారు. బ్రిక్స్‌ అన్ని రంగాలలోనూ సానుకూల పాత్ర పోషించగలదని నమ్ముతున్నానని ప్రధాని మోడీ తెలిపారు.

Tags

Next Story