Sheikh Hasina:షేక్ హసీనా అప్పగింతపై బంగ్లా అభ్యర్థను పరిశీలిస్తున్నాం..కేంద్రం

గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అయితే, ఈ అల్లర్లలో పలువురు మరణాలకు కారణమయ్యారని, మానవత్వానికి వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో, హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్, భారత్‌ను కోరుతోంది.
షేక్ హసీనా అప్పగింతపై బంగ్లాదేశ్ మరోసారి కొత్తగా అభ్యర్థనను అందించిందని భారత విదేశాంగ శాఖ బుధవారం చెప్పింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ‘‘తమకు ఒక అభ్యర్థన అందింది. కొనసాగుతున్న న్యాయ, అంతర్గత చట్టపరమైన ప్రక్రియలలో భాగంగా ఈ అభ్యర్థనను పరిశీలిస్తున్నాము. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నాము. ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం కోసం అందరు వాటాదారులతో ఈ విషయంలో నిర్మాణాత్మకంగా పాల్గొంటూనే ఉంటాము’’ అని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

