INDIA: భారత్ అణు శక్తి మరింత బలోపేతం

INDIA: భారత్ అణు శక్తి మరింత బలోపేతం
X
విశాఖ తీరంలో INS అరిఘాత్ నుంచి K-4 క్షిపణి సక్సెస్... సముద్ర గర్భం నుంచి అణు క్షిపణి ప్రయోగంలో భారత్ విజయం... 3,500 కి.మీ పరిధితో శత్రు లక్ష్యాల ధ్వంసం

భారత రక్షణ రంగం మరో అద్భుత మై­లు­రా­యి­ని అధి­గ­మిం­చిం­ది. సము­ద్ర గర్భం నుం­చి అణు దా­డు­లు చే­య­గల సా­మ­ర్థ్యా­న్ని భా­ర­త్ ప్ర­పం­చా­ని­కి చా­టి­చె­ప్పిం­ది. స్వ­దే­శీ అణు జలాం­త­ర్గా­మి ఐఎ­న్ఎ­స్ అరి­ఘా­త్ (INS Arighaat) నుం­చి అత్యంత శక్తి­వం­త­మైన 'కే-4' (K-4) బా­లి­స్టి­క్ క్షి­ప­ణి­ని 2025 డి­సెం­బ­ర్ 23న బం­గా­ళా­ఖా­తం­లో వి­జ­య­వం­తం­గా పరీ­క్షిం­చా­రు. ఈ ప్ర­యో­గం­తో భా­ర­త్ తన 'అణు త్ర­యం' (సా­మ­ర్థ్యా­న్ని పూ­ర్తి­స్థా­యి­లో సు­స్థి­రం చే­సు­కుం­ది.

చైనాకు షాక్:

వా­స్త­వా­ని­కి ఈ ప్ర­యో­గం డి­సెం­బ­ర్ మొ­ద­టి వా­రం­లో­నే జర­గా­ల్సి ఉంది. అయి­తే బం­గా­ళా­ఖా­తం­లో చై­నా­కు చెం­దిన నిఘా నౌ­క­లు సం­చ­రి­స్తుం­డ­టం­తో, మన క్షి­ప­ణి సమా­చా­రం శత్రు­వు­ల­కు చి­క్క­కుం­డా ఉం­డేం­దు­కు DRDO, ఇం­డి­య­న్ నేవీ అత్యంత గో­ప్య­త­ను పా­టిం­చా­యి. ఆ నౌ­క­లు వె­ళ్ళి­పో­యిన వెం­ట­నే, వ్యూ­హా­త్మ­కం­గా ఈ ప్ర­యో­గా­న్ని ని­ర్వ­హిం­చి లక్ష్యా­న్ని అత్యంత ఖచ్చి­త­త్వం­తో ఛే­దిం­చా­యి.

'కే-4' అమ్ములపొదిలో అజేయ శక్తి

ఈ క్షిపణికి క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం 'K' అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకతలు.

3,500 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదిస్తుంది. హిందూ మహాసముద్రం నుంచి ఆసియాలోని ప్రధాన ప్రాంతాలను గురిపెట్టవచ్చు. సుమారు 2 నుంచి 2.5 టన్నుల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. నీటి లోపల సైలో (Silo) నుంచి బయటకు వచ్చి, ఉపరితలంపైకి చేరాక మోటార్లు మండి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. 12 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువుతో ఘన ఇంధనంతో పనిచేస్తుంది.

'సెకండ్ స్ట్రైక్' సామర్థ్యమే అసలు బలం

భా­ర­త్ 'నో ఫస్ట్ యూ­స్' వి­ధా­నా­న్ని పా­టి­స్తుం­ది. ఒక­వేళ శత్రు­వు మనపై మొ­ద­టి అణు దాడి చే­సి­నా, సము­ద్ర గర్భం­లో దాగి ఉన్న అరి­ఘా­త్ వంటి జలాం­త­ర్గా­ముల ద్వా­రా తి­రి­గి శత్రు­వు­ను నా­మ­రూ­పా­లు లే­కుం­డా చేసే 'సె­కం­డ్ స్ట్రై­క్' సా­మ­ర్థ్యం ఇప్పు­డు భా­ర­త్‌­కు తి­రు­గు­లే­ని వి­ధం­గా లభిం­చిం­ది.

అగ్రరాజ్యాల సరసన భారత్

ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాల వద్ద మాత్రమే సముద్ర గర్భం నుంచి అణు క్షిపణులను ప్రయోగించే సాంకేతికత ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ ఎలైట్ క్లబ్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. త్వరలోనే 5,000 కిలోమీటర్ల పైగా పరిధి ఉన్న కే-5 (K-5) క్షిపణులను కూడా భారత్ పరీక్షించనుంది. ఈ విజయంతో భారత్ రక్షణ కవచం అజేయంగా మారిందని, సరిహద్దుల్లో శత్రువుల కదలికలకు ఇది గట్టి హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రయోగం కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, భారత జలాల్లోకి చొరబడాలని చూసే శత్రువులకు పంపిన బలమైన హెచ్చరిక. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన కే-4, రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. త్వరలోనే 5,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగల కే-5 క్షిపణిని సిద్ధం చేస్తూ, భారత్ తన అజేయ శక్తిని మరింత విస్తరించుకోనుంది. నింగి, నేల, ఇప్పుడు నీటి అడుగున కూడా భారత్ అజేయంగా మారింది.. నవభారత రక్షణ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం.

Tags

Next Story