Corona 4th Wave: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్‌కు సంకేతమా..?
Corona 4th Wave: రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా కలవరం మొదలైంది. పెరుగుతున్న కేసులు.. ఫోర్త్ వేవ్‌కు సంకేతమా అన్న గుబులురేగుతోంది. వ్యాక్సినేషన్‌తో.. ఫోర్ట్ వేవ్ అంతగా ప్రభావం చూపకపోవచ్చన్న విశ్లేషకులు.. ఏమాత్రం నిర్లక్ష్యంగా చేయకుండా అలర్ట్‌గా ఉండాలన్నారు. కొవిడ్ తన రూపాన్ని మార్చుకుంటూ.. ప్రభావం చూపనుండటంతో ముందస్తు చర్యలే మేలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అటు కరోనా కేసుల పెరుగుదల మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా 5 రాష్ట్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
కొత్త కేసుల సంఖ్య నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే రెండువేల 700 కేసులు నమోదుతో సర్కార్ అలర్ట్ అయ్యింది. అటు రాజధాని ముంబయిలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. జనవరి 26 తర్వాత అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కేసుల క్రమేపి పెరుగుతుండటంతో అప్రమత్తమైన శివసేన సర్కార్ ..రద్దీ ప్రదేశాల్లో మాస్త్ తప్పనిసరి చేసింది. మరోవైపు తెలంగాణలో116 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 83 కేసులు వెలుగులోకి వచ్చాయి.
కరోనాపై విచారణ జరిపిన హైకోర్టు.. కొవిడ్ టెస్ట్‌లు పెంచాలని టీఆర్‌ఎస్ సర్కార్‌ను ఆదేశించింది. కరోనా మృతులకు ఎక్స్‌గ్రేషియాపై నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఇండియాలో ఫోర్త్‌వేవ్ అతి త్వరలోనే రాబోతోందని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు. మూడు నుంచి నాలుగు వారాల్లో ఇండియాలో ఫోర్త్ వేవ్ రావొచ్చని చెబుతున్నారు. కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ దేశంలో ఫోర్త్‌వేవ్ తప్పదనే హెచ్చరిక చేసింది. జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కూడా ఇదే విషయం చెప్పింది.
కేసులు నెమ్మదిగా పెరగుతుండడాన్ని చూస్తుంటే.. మరో మూడు నాలుగు వారాల్లో ఫోర్త్‌వేవ్ రావొచ్చనడానికి సంకేతమని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. మొన్నామధ్య ఢిల్లీలోనూ ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. ఈ గణాంకాలే ఫోర్త్‌వేవ్ వస్తుందనడానికి సంకేతాలని చెబుతున్నారు. అయితే, టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ మాత్రం ఇండియాలో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటూ ప్రకటన చేసింది.
ఇండియాలో థర్డ్‌వేవ్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తక్కుగానే ఉంది. ఫోర్త్ వేవ్ కూడా అంత ప్రభావం చూపించకపోవచ్చనేది నిపుణుల అంచనా. ఈసారి వచ్చే ఫోర్త్‌వేవ్‌లో కరోనా సోకినా సరే లక్షణాలు కనిపించకపోవచ్చంటున్నారు. లేదంటే స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించే అవకాశం ఉందంటున్నారు.
ముఖ్యంగా దేశంలో చాలా వరకు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి.. ఆస్పత్రిలో చేరాల్సినంత సీరియస్ పరిస్థితి అయితే ఉండబోదని బలంగా చెబుతున్నారు. కాకపోతే, జాగ్రత్తలు పాటించడం, మాస్కులు వాడడం ద్వారా ఫోర్త్‌వేవ్ రాకుండా చూసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా.... కరోనాపై కఠినమైన నిఘా ఉంచాలని కేంద్రం ఐదు రాష్ట్రాలను హెచ్చరించింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు రాసిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com