El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్‌ ఈసారి మండే ఎండలు

El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్‌ ఈసారి మండే ఎండలు
కూలర్లు, ఏసీలకు పని మొదలు తప్పదు

ఎల్ నినో పరిస్థితులు ఈ సీజన్‌లోనూ కొనసాగుతాయని, దీంతో ఈసారి భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తున్నది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మార్చి-మే మధ్యలో దేశవ్యాప్తంగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మించి నమోదవుతాయి.

ఈ నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, మార్చి, మే మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్ వంటి ఈ రాష్ట్రాల్లో వాతావరణం ప్రారంభంలో చాలా వేడిగా ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి, మే మధ్య ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. మార్చి నెల రెండో వారం తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

మార్చి నెలలో ఉత్తర, మధ్య భారతదేశంలో వేడిగాలులు వీచే అవకాశం తక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తక్కువగా ఉండడంతో రుతుపవనాలు సకాలంలో వస్తాయని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం వేసవి వరకూ ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అన్నారు. మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య ఉంచి ఏర్పడనున్నట్లు అంచనా. మార్చి ప్రారంభంలో, మహారాష్ట్రతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. ఈ నెలలో కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story