Coronavirus: దేశంలో 5 వేలకి పెరిగిన క్రియాశీల కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 500కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 573 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,565కి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యాయి. హర్యాణాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చైనాలో తొలిసారిగా కొవిడ్ వైరస్ మహమ్మారి వెలుగు చూశాక ఇప్పటివరకు అనేక ఉత్పరివర్తనాలకు గురైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జేఎన్-1 సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. భారత్ లోనూ జేఎన్-1 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
గడచిన 24 గంటల్లో భారత్ 636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగింది. వీటిలో జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి. దేశంలో కొత్తగా నాలుగు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్ లో కొవిడ్ జేఎన్-1 యాక్టివ్ కేసుల సంఖ్య 197కి పెరిగింది. ఒక్క కేరళలోనే ఈ కేసులు 83 ఉన్నాయి. కాగా, తెలంగాణలో జేఎన్-1 కేసులు రెండు నమోదయ్యాయి. జేఎన్-1 సబ్ వేరియంట్ తో భయపడాల్సిన పనేమీ లేదని కేంద్రం చెబుతోంది.
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ కు సంబంధించి ఇప్పటికే పలు కీలక మార్గదర్శకాలను విడదుల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. పరిశుభద్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల సలహాలు పాటించాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com