Anil Chauhan : అణు బెదిరింపులను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి - అనిల్ చౌహాన్

దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోతుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు తమ యుద్ధ తంత్రాలుగా అణు బెదిరింపులు, రేడియో ధార్మిక పదార్థాల ప్రయోగాలు వంటి వాటిని ఉపయోగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో ప్రసంగిస్తూ..ఈ తీవ్రమైన మార్పులను ఎదుర్కోవడానికి భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని జనరల్ చౌహాన్ నొక్కి చెప్పారు.
అణు బెదిరింపులు, రేడియో ధార్మికతపై శిక్షణ అవసరం భవిష్యత్తులో అణ్వాయుధాల నుంచి వచ్చే రేడియో ధార్మిక కాలుష్యంతో డీల్ చేయడంపై భారత్‌లో శిక్షణనివ్వాల్సిన అవసరముందని CDS అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధానమంత్రి మోదీ తమతో మాట్లాడుతూ.. భారత్ అణు బెదిరింపులకు ఎన్నడూ భయపడకూడదని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా దేశంలో రక్షణ వ్యవస్థను, ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.
మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్‌కు వంద ఏళ్లు ఈ సందర్భంగా 1926లో స్థాపించిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ వందేళ్లుగా దేశ సైన్యానికి అందిస్తున్న సేవలను జనరల్ అనిల్ చౌహాన్ కొనియాడారు. సైనికులు యుద్ధాల్లో ఉన్నా, సముద్రాలపై ఓడల్లో ఉన్నా, నర్సింగ్ సిబ్బంది అన్ని అడ్డంకులకు ఎదురెళ్తూ వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com