లింగ సమానత్వంలో 127వ స్థానంలో భారత్

ఒక దేశ పురోగతిని ప్రభావితం చేసే అంశాల్లో లింగ సమానత్వం అత్యంత ముఖ్యమైంది. మానవ వనరుల్లో సగ భాగమైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు ఆర్థికంగానే కాకుండా సంతృప్తి సూచీలోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఈ లింగ సమానత్వ సూచిలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ ఎక్కడో అట్టడుగున ఉండటం కలవరపరుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబర్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 146 దేశాల్లో భారత్‌కు 127 వ స్థానం దక్కింది. గత ఏడాది కంటే భారత్ ఎనిమిది స్థానాలు మెరుగుపరచి 127వ స్థానంలో నిలిచినట్లు WEF వెల్లడించింది. గత ఏడాది లింగ సమానత్వ సూచిలో భారత్‌కు 135వ ర్యాంకు వచ్చింది. భారత్ గత ఏడాది కంటే 1.4 శాతం పాయింట్లు మెరుగుపరుచుకుని 127వ స్థానంలో నిలిచిందని ప్రకటించింది. జెండర్ ఇండెక్స్‌లో పాకిస్థాన్ 142వ స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్ 59, చైనా 107, నేపాల్ 116, శ్రీలంకకు 115, భూటాన్‌కు 103 ర్యాంక్‌లు వచ్చాయి. ఐస్‌లాండ్ వరుసగా 14వ ఏడాది కూడా తొలిస్థానంలో నిలిచింది. భారత్‌లో వేతనాలు, ఆదాయంలో సమానత్వం ఉన్నప్పటికీ.. ప్రమోషన్లు, టెక్నాలజీ పాత్రల్లో మహిళల వాటా పడిపోయిందని నివేదిక వెల్లడించింది. రాజకీయ సాధికారతలో భారత్ 25.3 శాతం సమానత్వాన్ని నమోదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com