India : 26 ప్రదేశాల్లో పాక్ డ్రోన్లు, మిసైల్స్ కూల్చిన ఇండియా

India : 26 ప్రదేశాల్లో పాక్ డ్రోన్లు, మిసైల్స్ కూల్చిన ఇండియా
X

సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, మిస్సైల్స్‌ లతో పాక్‌ దాడి చేయడంతో.. ప్రతిస్పందించిన భారత్‌ ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి ధ్రువీకరించారు. పాక్‌ సైన్యం హెడ్‌క్వార్టర్‌ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది. ఇక భారత్‌పై దాడులకు ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ అంటే బలమైన పునాది అనే పేరుపెట్టింది. ఈ దాడులపై భారత వాయుసేన, సైన్యం నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు.

శ్రీనగర్‌లో 2 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేసింది భారత్. ఆకాష్‌ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్స్ ను కూల్చివేసింది.

అయితే యుద్ధ విమానాలు కూల్చేసమయంలో పైలట్ల దూకేసినట్టు తెలుస్తోంది. వీరు శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయినట్టు సమాచారం. దీంతో పాక్‌ పైలట్ల కోసం గాలిస్తున్నాయి భారత భద్రతా బలగాలు.

పాక్‌ దాడుల్ని సమర్థంగా తిప్పికొడుతున్నాయి భారత రక్షణవ్యవస్థలు. S-400 డిఫెన్స్‌ సిస్టమ్ సత్తాచాటుతోంది. ఇటు ఆకాష్‌ మిసైల్‌, L-70, Zu-33, షిల్కా ముందు పాక్‌ తేలిపోయింది. పాక్ ఫతా-1 క్షిపణిని భారత్ కూల్చివేసింది.

తెలియని వ్యూహాత్మక లక్ష్యం వైపు దూసుకుపోతున్న ఫతా-1 క్షిపణిని పశ్చిమ సెక్టార్‌లో భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags

Next Story