India: ఫ్రాన్స్ పర్యటనలో ఆయుధ ఒప్పందాలు

India: ఫ్రాన్స్ పర్యటనలో  ఆయుధ ఒప్పందాలు
26 రాఫెల్ విమానాలు, 4 స్కార్పియన్ జలాంతర్గాముల కొనుగోలు

జులై 14 న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా ప్యారిస్ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలను, 3 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది.దీంతో భారత్-ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించనుంది.

ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి అద్భుతమైన రాఫెల్ యుద్ధ విమానాలను అందుకున్న భారత్, మోదీ పర్యటనను మరిన్ని ఆయుధ కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోనుంది. యుద్ధ విమానాలు, జలాంతర్గాముల కొనుగోలుకు మేక్రాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ముందు భారత నేవీ పలు ప్రతిపాదనలు ఉంచింది. ఫ్రాన్స్ తో ఒప్పందం కుదిరితే, రాఫెల్ యుద్ధ విమానాలను, జలాంతర్గాములతో పాటు 22 సింగిల్ సీటర్ రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలతో పాటు 4 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్టులు కూడా భారత్ కు అందజేస్తారు.


హిందూ మహాసముద్రంలో, అరేబియా సముద్రంలో భద్రతా సవాళ్లు పెరిగిపోతుండటం, పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారత్ తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది. గత కొన్నేళ్లలో రక్షణరంగంలో భారత్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలు, ఆయుధాలను కొనుగోలు చేసింది.ఇంకా కొన్ని రాఫెల్ యుద్ధ విమానాలు, స్కార్పియన్ సబ్ మెరైన్లు అత్యవసరంగా కావాలని కోరుకుంటోంది.

అయితే ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటికే వైమానిక దళం కోసం రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు నావికా దళం కోసం రాఫెల్-ఎం విమానాలను కొనేందుకు సిద్ధమవుతోంది. రాఫెల్-ఎం ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక సముద్ర యుద్ధ విమానం. ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ రాఫెల్-ఎం విమానాన్ని తయారు చేస్తుంది. రాఫెల్ కంటే 80 శాతం అత్యాధునిక సాంకేతికతతో రాఫెల్-ఎం విమానాన్ని తయారు చేశారు. ఈ విమానాలను సముద్రంపై నిఘా కోసం, పోరాటం చేయడానికి వాడనున్నారు. అమెరికన్ ఫైటర్ హార్నెట్ కంటే ఈ విమానం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ లను మోహరించనున్నారు. జులై 13, 14 తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఈ కొనుగోలు ఒప్పందంపై మోదీ సంతకం చేసే అవకాశం ఉంది.ఈ మొత్తం డీల్ విలువ రూ. 90 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

Tags

Read MoreRead Less
Next Story