INDIA: వెనెజువెలా సంక్షోభం.. భారత్కు లాభమే

చమురు శుద్ధి సంస్థలను దూరం పెట్టిన వెనిజువెలా దేశ అధ్యక్షులను అమెరికా ఆయిల్ కంపెనీలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వలేదు , ట్రంప్ గెలవడానికి అతి ముఖ్య కారణమైన అమెరికా చమురు శుద్ధి సంస్థలకు ఇచ్చిన మాట నిలుబెట్టుకోవడానికి ప్రపంచ శాంతి దూత డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యని అపహరించి ఎత్తుకుపోయారు . (ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడ బలమైన న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన దేశాలు ఉంటాయి ) అమెరికా అనబడే అతి పెద్ద కార్పొరేట్ దెబ్బకి ప్రపంచంలోని 17% చమురు నిక్షేపాలు కలిగిన వెనిజువెలా అమెరికన్ సంస్థల గుత్తాధిపత్యం లోకి వెళ్లినట్టే!
భారత్కు శుభపరిణామం
అధికారికంగా మత్తు పదార్థాలను తయారు చేసే కొలంబియా మెక్సికో పేరు చిలీ చివరికి డ్రగ్స్ పెడ్లర్ అయినటువంటి చైనా జోలికి వెళ్ళని అమెరికా వెనిజులా జోలికి వెళ్లడానికి కారణం చమురు నిక్షేపాలు మాత్రమే . వెనిజువెలా అధ్యక్షుడి మార్పు అనేది రెండు నెల క్రితమే జరుగుతుందని అందరూ ఊహించారు కాకపోతే రెండు నెలలు లేట్ అయింది. ఇప్పుడు వెనిజువెలాలోకి అమెరికా సంస్థలు వచ్చి ప్రపంచ చమురు ధరలని నిర్దేశిస్తాయని రెండు నెలల క్రితమే క్రూడ్ ఆయిల్ మార్కెట్ పసిగట్టింది. ఇప్పుడు అమెరికా చేసే మొదటి పని రష్యా అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే మనలాంటి దేశాలకు డిస్కౌంట్ సేల్ ప్రకటించడం ఇది ట్రేడ్ డీల్ లో ఉండబోతుంది , ప్యూర్ కామర్స్ లో ఇది మన దేశానికి శుభ పరిణామం. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ ప్రగతిని అడ్డుకోకపోతే చమరు శుద్ధి సంస్థలు మూతపడతాయి, ఇప్పుడు ఈ లాబీ ఆల్టర్నేటివ్ ఎనర్జీ పోటీ తట్టుకోవడానికి విచ్చలవిడి డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ సంవత్సరం మనం క్రూడ్ బారెల్ ధర మినిమం 20% డిస్కౌంట్ లో చూస్తాము. రష్యా అరబ్ దేశాలతోపాటు అమెరికా అనబడే కొత్త సప్లయర్ మనకు అందుబాటులోకి వచ్చాడు, చాలా మంది తెలియకపోవచ్చు మన దేశం కూడా చమురులు దిగుమతి చేసుకొని శుద్ధిచేసి ఇతర దేశాలకు మంచి లాభాలతో అమ్ముకుంటుంది. ఇది కూడా మనకు కలిసి వచ్చే అంశం.
అమెరికా మోనోపోలీ
ఇది కొంత కాలమే. ఆయిల్ వ్యాపారంలో మోనోపోలీ వస్తే అమెరికా ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచే అవకాశం లేకపోలేదు. కానీ.. అమెరికా మోనోపోలీ చేయలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇరాక్ ను ఆక్రమించి పెట్రో- డాలర్ బలవంతంగా ప్రపంచం మీద రుద్ది, అమెరికా చేసేది మోనోపలీనే కదా! ఇప్పుడు వెనిజువెలా న ఆక్రమించి మరింతగా మోనోపలీ పెంచుకునే ప్రమాదం లేదా అనేది ప్రశ్న. అయితే.. ఒక సార్వభౌమ దేశం (వెనిజులా)పై మరో దేశం (అమెరికా) సైనిక దాడి చేసి, దాని అధ్యక్షుడు నికోలస్ మడురోను కిడ్నాప్ చేసి, అమెరికాకు తరలించడం అంతర్జాతీయ చట్టాలకు తీవ్ర అతిక్రమణ. ఇది ఐక్యరాష్ట్ర సన్నద్ధ సంఘ ఛార్టర్ ఆర్టికల్ 2(4)ను ఉల్లంఘించడమే. ఏ దేశమూ మరొక దేశ సార్వభౌమత్వాన్ని బలవంతంగా దెబ్బతీయకూడదు. ఇలాంటి చర్యలు చరిత్రలో చాలా అరుదు ఎప్పుడూ "సాధారణం" కావు. 1989లో అమెరికా పనామా దాడి చేసి మాన్యువల్ నొరిగాను పట్టుకున్నా, అది కూడా వివాదాస్పదమే. ఇప్పుడు జనవరి 3, 2026న జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. చైనా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, కొలంబియా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది దక్షిణ అమెరికాలో శాంతి-స్థిరత్వానికి ముప్పు అని చాలా మంది చెబుతున్నారు. ఇలాంటివి "నార్మల్" అయితే, నిజమే.. అంతర్జాతీయ నియమాలు, సార్వభౌమత్వం అనేవి అర్థరహితమవుతాయి. కానీ ఇది ఇప్పటికీ అసాధారణమే, దీని పరిణామాలు ఇంకా కనిపిస్తాయి. ప్రపంచం ఇలాంటి చర్యలను అంగీకరించదు. అదే మనకు ఆశ ఇచ్చేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

