Jaishankar : ఉగ్రవాదాన్ని భారత్ సహించదు : జైశంకర్

Jaishankar : ఉగ్రవాదాన్ని భారత్ సహించదు : జైశంకర్
X

పాకిస్థాన్ అణ్వాయుధ బ్లాక్మెయిల్ కు భారత్ లొంగదని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ సహించేది లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేసారు. యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీలో ఆ దేశ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్తో ఆయన సమావేశమ య్యారు. ఉగ్రవాదం పట్ల దేశ వైఖరి, ఆపరేషన్ సిందూర్ అంశాలను ప్రత్యేక ఎంపీల బృందాల ద్వారా ప్రపంచ దేశాలకు భారత్ చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో జర్మనీ పర్యటనలో ఉన్న దేశ విదేశాంగ జైశంకర్ ఉగ్రవాదం, పాకిస్థాన్పై ద్వైపాక్షిక సంబంధా లపై స్పందించారు. పాకిస్థాన్తో భారతదేశం పూర్తిగా ద్వైపాక్షిక పద్ధతిలోనే వ్యవహరిస్తుంద న్నారు. ఈ విషయంలో ఎటువంటి అనుమా నాలు అక్కర్లేదని చెప్పారు. ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ప్రతి దేశానికి ఉందన్న జర్మనీ చెప్పిన మాటలు చాలా విలు వైనవిగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెరు్ను కూడా కలిశారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తుందన్నా రు. ఆ దేశ ఆర్థిక, ఇంధన మంత్రి కాథరినా రీచేనితో పరిశ్రమలు, వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగ స్వామ్యానికి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా మరిన్నిరంగాల్లో సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

Tags

Next Story