Indian Astronaut Shubhamshu : నేడే శుభాంశు రోదసీ యాత్ర ప్రయాణం

భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసియాత్ర ప్రయాణం కాసేపట్లో మొదలుకానుంది. ఆరుసార్లు అంతరిక్ష ప్రయాణం వాయిదా పడిన తర్వాత చివరకు బుధవారం నాడు రోదసీయాత్రకు నాసా సర్వం సిద్ధం చేసింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నదని నాసా వెల్లడించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించనున్నట్లు తెలిపింది. వాతావరణం సరిగా లేకపోవడం, సాంకేతిక కారణాలతో ఇప్పటికే వాయిదా పడింది. వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ స్పేస్ క్యాప్సూలు ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అవుతుంది. శుభాంశు శుక్లా బృందం ఐఎస్ఎస్ లో 14 రోజులపాటు ఉండి వివిధ పరిశోధనలు నిర్వహిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com